పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన గోకర్ణేశ్వరస్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా మారింది. 11వ శతాబ్దం రాజరాజనరేంద్రుని కాలం నుంచి ఈ ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇంతటి ప్రసిద్ధి చెందిన స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తిక మాస పర్వదినాల్లో సోమవారం పౌర్ణమి రోజున బోళా శంకరుడిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపారాధన చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా దేవస్థాన పాలకవర్గం, అధికారులు భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశారు.