పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ నదికి అడ్డుగా ఉండటంతో వరద నీరు ప్రాజెక్ట్ స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానల్ కు చేరుకుంది. ప్రస్తుతం పోలవరంలో గోదావరి వరద 8.45 మీటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రోజురోజుకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ముంపు గ్రామాలను ముందుగానే నిత్యావసర సరకులను పంపినట్లు ఐటీడీఏ పీవో సూర్యనారాయణ తెలిపారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు.
ఇదీ చదవండి: మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం