ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 25 కిలోల బియ్యంతో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఈ ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటికే వరదముంపులో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం రెండు వేల రూపాయల ఆర్ధికసాయాన్ని ప్రకటించింది. త్వరితగతిన బాధితులను గుర్తించి వారికి ఈ ఆర్దిక సాయం అందించాలని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: వరద నీటిలోనే గ్రామాలు... నిత్యావసరాల కోసం ప్రజలు పాట్లు