లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మందికి దంత, కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాలకొల్లు రాధా రమణి కంటి ఆసుపత్రి, భీమవరం విష్ణు దంత వైద్య కళాశాల వైద్యులు శిబిరంలో సేవలందించారు. గ్రామాల్లో ఎక్కువ మంది పడుతున్న ఇబ్బందులు గుర్తించి, అవసరమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వంక రవీంద్రనాథ్ తెలిపారు.
ఇది చూడండి: ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా