పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వరి కోత యంత్రాల కిరాయిలు నియంత్రించాలని, ధాన్యం కొనుగోలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని నినాదాలు చేశారు. భారీ వర్షాలకు వరి చేలు నేలకొరిగాయని ఫలితంగా ఎకరానికి 3 గంటల సమయం పడుతుందన్నారు.
వరి కోత యంత్రాల నిర్వహకులు గంటకు రూ.3 వేలు ఇస్తేనే కోతలు చేపడుతున్నారని రైతులు వాపోయారు. చైను యంత్రానికి రూ.2 వేలు, టైర్లు ఉన్న యంత్రానికి రూ. 1500 తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం లెక్కింపు, తూకాల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి