రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సర్పంచ్ల హక్కులను అధికార ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం చెందిన పలువురు సర్పంచులతో కలిసి కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్న ప్రాధాన్యత.. ప్రజలు ప్రత్యేక్షంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచులకు ఇవ్వటం లేదన్నారు. సీఎం జగన్ గ్రామాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండీ.. గుంటూరు జిల్లాలో దారుణం..ఇద్దరు చిన్నారుల హత్య!