ETV Bharat / state

తణుకులో మాజీ మంత్రి మాణిక్యాలరావు జయంతి వేడుకలు - west godavari latest news

రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు దివంగత పైడి కొండల మాణిక్యాలరావు 60వ జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా నిర్వహించారు.

తణుకులో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు

author img

By

Published : Nov 1, 2020, 10:03 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ దేవాదాయ శాఖ మంత్రి, దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు భాజపా నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకునిగా పార్టీకి చేసిన సేవలను, దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను కొనియాడుతూ నాయకులు నివాళులర్పించారు.

బాజపా నాయకులు పి.వి.రామారావు ఆర్థిక సహకారంతో 100 మంది పేద బ్రాహ్మణులకు, అర్చకులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బాజపా అధ్యక్షులు నార్ని తాతాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా బ్రాహ్మణులకు అర్చకులకు సహకారం అందించారు.

ఇదీచదవండి

తణుకులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.