పశ్చిమగోదావరి జిల్లాలో గులాబ్ తుపాన్ అలజడి సృష్టించింది. ఫలితంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగాయి. చింతలపూడి, టీ నరసాపురం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, లింగపాలెం మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో వరద నీరు చేరడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వరద నీరు నిలిచిన పాఠశాలకు సెలవు ప్రకటించారు. టి.నర్సాపురం పోలీసుస్టేషన్, మీ సేవ, బిఎస్ఎన్ఎల్, రైతు భరోసా కేంద్రం, పోలీసు క్వార్టర్స్‌లో వరదనీరు చేరింది.
ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరదనీరు చేరడంతో ఆసుపత్రి మొత్తం బురదమయం అయ్యింది. వరద నీరుతో కొన్ని రకాల మందులు, సెలైన్ సీసాలు తడిసి ముద్దయ్యాయి. ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా వరద నీరు నిలిచి పోయింది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: