ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు ఆరు లక్షల 37,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ నీరంతా కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ, గోదావరి నది పాయల ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. నదీ పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. చాకలి పాలెం సమీపంలోని వశిష్ట గోదావరి అనుబంధ పాయలోకి వరద నీరు పోటెత్తడంతో అక్కడ కాజ్వే ముంపు బారిన పడింది. కనకాయలంక గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: floods in agency : వరద సుడిలో మన్యం