![fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9790204_267_9790204_1607317203689.png)
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు యూనియన్ బ్యాంక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. బ్యాంకు చుట్టుపక్కల ప్రదేశమంతా పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
![fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9790204_575_9790204_1607317238217.png)
ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకు భవనం పైన ప్రైవేటీ కాలేజీ ఉంది. మంటలు వ్యాపించటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
ఇవీ చదవండి..