కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కూరగాయలు రోడ్డుపై పోసి.. నినాదాలుచేశారు. ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి ఆటోలో కూరగాయల సంచులు తెచ్చి.. ఉచితంగా పంచిపెట్టారు. కిలో రెండు, మూడు రూపాయలకు ఇవ్వడం కంటే ఉచితంగా ఇవ్వడం మేలని పంపిణీ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. కూరగాయల రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. లాక్ డౌన్ వల్ల అన్నిరకాల కూరగాయలకు ధరలు లేవని ఆందోళన చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సింహాల మధ్య సింపుల్గా బిడ్డకు జన్మనిచ్చింది!