గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. వేలి ముద్రలు, బ్యాంకు ఖాతా నంబరు రాబట్టారు. సవివరంగా చెప్పక పోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని బెదిరించారు. అమాయక ప్రజలు ఆ వలలో చిక్కారు. మొబైల్కు వచ్చిన సంక్షిప్త సందేశం చూసి షాకయ్యారు. తీరా చూస్తే.. వారి అకౌంట్లోంచి నగదు మాయమైంది. లబోదిబో మంటూ బ్యాంకుకెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు డ్రా చేశారంటూ సిబ్బంది తెలిపారు. ఇలా నకిలీ గ్రామ వాలంటీర్లు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామస్థుల డబ్బు కొట్టేశారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందుకే... ప్రజలారా..! తస్మాస్ జాగ్రత్త..!! ఇలాంటి కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి.
ఇవీ చదవండి