కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొవిడ్ బారినపడిన బాధితులలో పేద, బడుగు వర్గాలకు చెందిన కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఉందుర్తి పాల్ ఫౌండేషన్ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేద, బడుగు వర్గాల కుటుంబీకులకు దాతల సహకారంతో ఆపన్నహస్తం అందిస్తోంది.
తణుకు, ఇరగవరం, ఉండ్రాజవరం మండలాలతో పాటు వివిధ గ్రామాల్లో సేవలు చేస్తోంది. సుమారు రెండు వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం అందించారు. స్థానిక ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్ల సహకారంతో బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ప్రస్తుత కష్టకాలంలో బాధితుల ఇబ్బందులను గుర్తించి దాతల సహకారంతో తాము ముందుకు నడుస్తున్నామని నిర్వాహకులు ప్రసన్న కుమార్ అన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేద, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి. రోగుల సహాయకుల ఆకలి తీరుస్తున్న రెడ్ క్రాస్ సంస్థ