ETV Bharat / state

ELECTRIC BIKE: మరో ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు..! - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

ELECTRIC BIKE: వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతుండడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం అనే కాన్సెప్ట్ తో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నారు. కానీ.. అవి పేలిపోతుండడంతో ఇప్పటికే కొన్నవారు భయపడుతుండగా.. మిగిలిన వారు అటువైపు ఆలోచన చేయాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

ELECTRIC BIKE
మరో ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు
author img

By

Published : May 19, 2022, 2:25 PM IST

ELECTRIC BIKE: మరో ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు చెలరేగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారి తోట రైల్వేగేట్ సమీపంలో ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ అగ్నికి ఆహుతైంది. భీమవరానికి చెందిన మేడిశెట్టి ఆదినారాయణ ఎలక్ట్రికల్ బైక్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. ఆ తర్వాత పొగలు వచ్చాయి. అప్రమత్తమైన ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని రహదారిపైనే వదిలేసి దూరంగా వెళ్లిపోయారు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రికల్ బైక్‌ మొత్తం కాలి బూడిదైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.