పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో క్షుద్రపూజలు చేయడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. నివాస గృహాల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, జాకెట్ ముక్క, బొగ్గులు పెట్టిన ఆనవాళ్లు ఉండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పూజలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ద్వారకా తిరుమలలో క్షుద్రపూజల కలకలం - kshudra pujalu kalakalam
ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఈ పూజలు నిర్వహించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
![ద్వారకా తిరుమలలో క్షుద్రపూజల కలకలం Dwarfism](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668369-579-6668369-1586067140536.jpg?imwidth=3840)
ద్వారకాతిరుమలలో క్షుద్రపూజల కలకలం