తనకున్న అప్పులను తీర్చుకునేందుకు బీమా కంపెనీ నుంచి డబ్బు రాబట్టుకునేందుకు ప్రణాళిక వేసిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురానికి చెందిన వెంకటేశ్వరరావు తన గోదాములో లక్షలాది రూపాయలు విలువచేసే తలవెంట్రుకలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీటి విలువ సుమారు రూ. 60లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కూపీలాగిన పోలీసులు అసలు దొంగ.. తలవెంట్రుకల కంపెనీ యజమాని వెంకటేశ్వరరావే అని నిగ్గుతేల్చారు. దొంగతనం జరగకపోయినా.. బీమా కోసం పోలీసు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడు. లాక్ డౌన్ వల్ల అప్పులపాలయ్యానని అందుకే ఇలా చేశానని వెంకటేశ్వరరావు తెలిపాడు.
ఇదీ చూడండి: ప్రభుత్వం వైద్యుల సమస్యలు పరిష్కరించాలి: నారా లోకేష్