కరోనా కేసులు పెరుగుతున్నందున పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సడలింపులతో కూడిన లాక్డౌన్ విధించారు. సోమవారం నుంచి పట్టణ పరిధిలోని దుకాణాల అనుమతి సమయాన్ని కుదించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. నిత్యావసరాలకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. మిగిలిన వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని మాత్రం పట్టణంలోకి అనుమతించారు. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధికారులు కోరారు.
ఇదీ చదవండి: విశాఖలో కొవిడ్ పరీక్షలకు భయపడి మహిళ పరారీ