పశ్చిమగోదావరిజిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. నలుగురు పిల్లలతోపాటు ఇద్దరు వ్యక్తులను కరవటంతో బాధితులు తణుకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇటీవల కాలంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. వీధివీధినా కుక్కల దండు కనిపిస్తున్నా పంచాయతీ అధికారులకు పట్టటంలేదు. అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. బయటికి వెళ్లాలంటానే భయమేస్తోందంటున్నారు. తమను కుక్కల నుంచి రక్షించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి