పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిషన్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై మీడియా చేస్తున్న ప్రచారం ఎంతో విలువైనదని జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలతో పాటు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చేసిన సేవలు అమోఘమని సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ అన్నారు. ప్రవాసాంధ్రుడు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఇది చదవండి అడవి జంతువులను వేటాడుతున్న ఇంటి దొంగ