జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో అనధికార కట్టడాలను పంచాయతీ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డాబాను ధ్వంసం చేశారు. కరోనా సమయంలో నిబంధనలు పాటించకుండా డాబా పనిచేసిందని... దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని ఈవో సుబ్బరాయన్ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చి వేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి :