ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అంతుచిక్కని కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ వైద్యులను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్ ముత్యాలరాజు, వైద్య బృందాలు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
ఇదీచదవండి