పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎల్.బి చర్ల బ్రాందీ షాపు వద్ద రెండో రోజు కూడా మద్యం కోసం మందుబాబులు అర కిలోమీటరు మేర క్యూ కట్టారు. విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల సిబ్బంది... ఎన్ని చర్యలు చేపట్టినా మందుబాబులు వారి తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నరసాపురం రెడ్ జోన్ ప్రాంతంలోని వారు కూడా మద్యం కోసం బయటకు వస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని కొంతకాలం మూసివేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి ప్రతి గ్రామంలోనూ క్వారంటైన్ వసతులు: సీఎం