ETV Bharat / state

జిల్లాలో భారీ వర్షాలు.. నీట మునిగిన నారుమళ్లు - west godavari rain news

జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దమ్ములు పూర్తి చేసి, నారుమళ్లు ఎదుగుతున్న సమయం, నాట్లు వేసే సమయంలో భారీగా కురుస్తున్న వర్షాలు రైతులకు శాపంగా మారుతున్నాయి.

west godavari dist
జిల్లాలో భారీ వర్షాలు.. నీట మునిగిన నారుమళ్లు
author img

By

Published : Jul 15, 2020, 9:38 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్లపు భూముల్లోని నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. కొన్ని చోట్ల పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నాట్లు చివరి వరకు మునిగిపోవడం రైతులను కంగారు పెడుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ పశ్చిమబెంగాల్ కూలీలు అందుబాటులో లేక స్థానికుల మీదే ఆధారపడ్డారు. అందువల్ల ఎకరం విస్తీర్ణానికి 30 కిలోల వంతున విత్తనాలతో నారుమళ్లు పెంచారు. కురుస్తున్న వర్షాలతో నారుమళ్లు, నాట్లు కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వర్షాలతో ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందని చెప్పలేమని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాలలో 25 శాతం మేర నారుమళ్లు నాట్లు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇదీ చదవండి:

పది రోజుల్లో 1500 కేసులు.. నిండుతున్న ఆసుపత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.