వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో కుండపోత వర్షం కురిసింది. గొల్లగూడెం మీదుగా ప్రవహిస్తున్న తాడిపూడి కాలువకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వందల హెక్టార్లలో వరి, పామాయిల్, మినప సాగుకు భారీగా నష్టం వాటిల్లింది.
నల్లమాడు గ్రామంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇరిగేషన్ చెరువులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడం వల్ల ప్రమాదకరంగా మారింది. నల్లమాడు, యర్రమిల్లిపాడు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వెల్లమిల్లి, బాదంపూడి, నారాయణపురం, కైకరం తదితర గ్రామాలలో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. పెట్టుబడులు కూడా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి:
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక