ETV Bharat / state

అక్రమంగా గో రవాణా...47 గోవులు స్వాధీనం - పశ్చిమగోదావరి తాజా వార్తలు

నిబంధనలకు విరుద్ధంగా గోవులను తరలిస్తున్న ఓ వ్యాన్​ను గ్రామస్థులు సాయంతో పట్టుకుని భాజపా, జనసేన నాయకులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో జరిగింది.

cows van seize in west godavari district
అక్రమంగా గో రవాణా
author img

By

Published : Jan 8, 2021, 12:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 47 గోవులను పట్టుకుని చింతలపూడి పోలీసు స్టేషన్​కు తరలించినట్లు భాజపా నాయకులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఏలూరు మీదుగా హైదరాబాద్​కు గోవులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద పోలీసులు నిఘా పెట్టారు. దీంతో చింతలపూడి మండలం లింగగూడెం సమీపంలో ఓ వ్యాన్ రావడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. అందులో నాలుగు కాళ్లను తాళ్ళతో బంధించి అతి క్రూరంగా తరలిస్తున్న 47 గోవులను గుర్తించారు. వాటిని తరలించేందుకు వ్యాన్ వెనుక భాగంలో రెండు అరలుగా తయారు చేసి గోవులు కదలకుండా కాళ్లు బంధించి ఒకదానిమీద ఒకటి ఉండే విధంగా గోవులను వ్యానులో ఎక్కించారు.

గోవులు పడే అవస్థలు చూసిన భాజపా నాయకులు దేవతకు సమానమైన గోవులను అతి దారుణంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వ్యాన్, గోవులను పోలీసు స్టేషన్​కు తరలించారు. గోవులను గోశాలకు తరలించి.... వ్యాన్ స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన రింగువలల వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.