కొవిడ్ సమయంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన తమకు న్యాయం చేయాలంటూ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
తాత్కాలికంగా పని చేయించుకుని.. వేతనాలు ఇవ్వకుండా బయటకు పంపడాన్ని వైద్యులు ఖండించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ప్రాణాలకు తెగించి సేవలందించినా.. తమకు ఎటువంటి ప్రయోజనం కల్పించలేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: