పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 22వ తేదీ నుంచి పట్టణ పరిధిలో దుకాణాల అనుమతి సమయాన్ని కుదించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలలో అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. రెవిన్యూ అధికారులు పూర్తి బందుకు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు, ఔషధ దుకాణాలకు మినహాయింపు నిచ్చారు.
నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండల గ్రామాలలో కేసులు విజృంభిస్తుండటంతో అధికారులు మరింత పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సూచించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వ్యాపారులు, ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కోరారు.
కరోనా వైరస్ విజృంభణతో ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. ఉండ్రాజవరం మండలం లోని 15 గ్రామాల్లో అధికారులు పూర్తి బందుకు పిలుపునిచ్చారు. ఆదివారం మాంసం దుకాణాలకు సైతం అనుమతినివ్వలేదు.
ఇదీ చదవండి: 'ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లు'