పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామంలోని రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవంలో వాగ్వాదం జరిగింది. కార్యక్రమానికి మాజీ మహిళా సర్పంచ్ హాజరయ్యారు. అయితే రిబ్బన్ కటింగ్ చేస్తున్న సమయంలో స్థానిక వైకాపా నాయకుడు ఆమెను పక్కకు నెట్టటంతో వారిమధ్య వివాదం నెలకొంది. ఘటనాస్థలంలో ఉన్న కొంతమంది సర్ది చెప్పటంతో అక్కడ నుంచి ఇంటికి వెళ్లారు. అనంతరం మహిళా సర్పంచ్ వర్గీయులు... తాము ఎస్సీ అయినందువల్లే మరో వర్గం వారు తమను అవమానించారంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు వారికి నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.
వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం - thendlam raithu barosa center news
రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. కార్యక్రమంలో తమను అవమానించారంటూ ఓ వర్గం నాయకులు రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలంలో జరిగింది.