కరోనా వైరస్ నివారణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు పూర్తి బంద్కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు, ఔషధ దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూసివేశారు.
రెడ్ జోన్ ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తుండటం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ పరిధిలో దుకాణాల అనుమతి సమయాన్ని కుదించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలలో అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో పట్టణ పరిధితో పాటు అత్తిలి మండల గ్రామాలలో కేసులు విజృంభిస్తుండటంతో అధికారులు మరింత పకడ్బంది చర్యలు చేపట్టారు.
ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని 15 గ్రామాల్లో అధికారులు పూర్తి బందుకు పిలుపునిచ్చారు. బంద్ కారణంగా మండల గ్రామాల్లోని ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చూడండి