పశ్చిమ గోదావరి జిల్లాలో వరద నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి కొంతమంది సహాయం అందిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న నిరుపేదలకు ఆహారం, దుస్తులు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కొల్లేరు తీర ప్రాంతాలు వరద నీటిలో ఉన్నాయి.
కనీసం నిత్యావసరాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుని తిండిలేక ఇబ్బంది పడుతున్న వారికి ఆకివీడుకు చెందిన ఏసుపాదం అనే వ్యక్తి సహాయం అందిస్తున్నారు. నిరుపేదలకు మంచినీరు, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: