ETV Bharat / state

చింతమనేని ఆందోళన... భగ్నం చేసేందుకు వైకాపా యత్నం

ఉపాధిహామీ పనులు కల్పించాలంటూ పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో కూలీలతో కలిసి తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ ఆందోళనకు దిగారు. భౌతికదూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే ఆందోళనను భగ్నం చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారు.

author img

By

Published : May 1, 2020, 1:22 PM IST

chintamaneni prabakar protest in duggirala

ఉపాధిహామీ పనులు కల్పించాలని చింతమనేని ఆందోళన

ఉపాధిహామీ పనులు కల్పించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూలీలతో కలిసి ఆందోళనకు దిగారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉపాధిహామీ పనులు కల్పించాలంటూ కూలీలతో కలిసి... భౌతికదూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అక్కడ చేరిన వైకాపా నాయకులు ఆందోళన భగ్నం చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. లాక్​డౌన్ సమయంలో ఆందోళన చేయడం సరికాదని పోలీసులు సూచించారు. పనులు కల్పిస్తేనే ఆందోళన విరమిస్తామనటంతో అక్కడికి చేరుకున్న ఉపాధిహామీ పథకం ఏపీవో సోమవారం నుంచి పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.