ఐదేళ్లలో రాజధాని పేరుతో ప్రజాధనం వృధా చేయడమే తప్ప అమరావతిలో ఒక నిర్మాణం కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. గత ప్రభుత్వం పనితీరుపై పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మండిపడ్డారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని ఓ వర్గం చేస్తున్న ఆందోళన కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుపడేలా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి తీరాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ చేస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ నెల 8న నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి...