ETV Bharat / state

తగ్గిన కోళ్ల లభ్యత.. పెరిగిన మాంసం ధర - ఏపీలో పెరిగిన చికెన్ ధరల వార్తలు

కరోనా భయంతో మొన్నటివరకూ ముక్క ముట్టని మాంసాహార ప్రియులు.. నేడు ధరల ఘూటతో తినడం తగ్గించేస్తున్నారు. మాంసం తింటే వైరస్ వస్తుందన్న అపోహతో.. చికెన్​కు దూరంగా ఉన్న వారు.. నేడు మాంసం తింటేనే మంచిదని తెలిసినా.. కొనలేక.. తినలేక.. ఆవేదన చెందుతున్నారు. ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు ఆకాశాన్నంటడమే ఈ పరిస్థితికి కారణం.

chicken rates high in ap state
పెరిగిన చికెన్ ధరలు
author img

By

Published : May 18, 2020, 12:51 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో చికెన్ తింటే వైరస్ ప్రబలుతుందన్న అపోహతో వినియోగదారులు మాంసం ముట్టలేదు. ఫలితంగా కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. కోళ్లను పెంచేవాకు బాగా నష్టపోయారు. కిలో కోడి మాంసాన్ని రూ. 30 నుంచి రూ. 40 రూపాయలకు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి.

అయితే... చికెన్ తినడానికి, కరోనాకు సంబంధం లేదని తెలిసి మాంసాహార ప్రియులు మళ్లీ మాంసం దుకాణాల వద్ద క్యూ కట్టారు. అదే సమయానికి చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కోళ్ల రైతులు, హేచరీల యజమానులు నష్టాల భయంతో కోళ్ల పెంపకం తగ్గించడమే ఇందుకు కారణమైంది.

కోళ్ల లభ్యత తక్కువగా ఉన్నందున మార్కెట్లో కేజీ మాంసం ధర రూ. 300 పైనే పలుకుతోంది. ఆ ధర చూసి వినియోగదారులు హడలిపోతున్నారు.

ఇవీ చదవండి:

పాల వ్యానులో 30 లీటర్ల నాటుసారా పట్టివేత...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.