పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకుడు నాయుడు రామచంద్రరావు మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలుగు రైతు ఉపాధ్యక్షునిగా, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్గా, లేపాక్షి డైరెక్టర్గా సేవలు అందించారని... చేపట్టిన ప్రతి పదవిలోనూ రాణించారని గుర్తు చేశారు. ఆయన క్రమశిక్షణ, పార్టీ పట్ల నిబద్ధత ప్రశంసనీయమన్నారు. రామచంద్రరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆయన మృతి తెదేపాకు తీరని లోటు: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన తేదేపా సీనియర్ నాయకుడు నాయుడు రామచంద్ర రావు... గణపవరం మండలం అగ్రహారం గోపవరంలో శుక్రవారం మరణించారు. ఆయన మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.