పశ్చిమగోదావరి జిల్లాలో నివర్ తుపాన్ కారణంగా 22,062 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. పంట నష్టపోయిన 45 వేల 105 మంది రైతులకు 33 కోట్ల 30 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీ వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు గౌసియా బేగం తెలిపారు.
మూడో విడత సాయంగా జిల్లాలోని 3,44,789 మంది రైతులకు 70 కోట్ల 55 లక్షలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 25న పరిహారం అందని వారికి నేడు జమ అవుతాయని జేడీఏ చెప్పారు. గతంలో రైతు భరోసా మంజూరు కాని రైతులు గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో 2,112 మందికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి:
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని