పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం, పసలపూడి, కాల్దరి, నిడదవోలు మండలం తాళ్లపాలెం, సింగవరం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షాలకు అపార పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బాధిత ప్రాంతాల్లో పర్యటించి రైైతులతో మాట్లాడారు.
ఎర్ర కాలువ ముంపు వల్లే..
అనంతరం ఎర్ర కాలువ ముంపునకు గురైన పంట పొలాల్లో కలియతిరిగారు. పెట్టుబడి పూర్తి అయి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో ఎర్ర కాలువ వరద నిలువునా ముంచేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరద నీటిలోని వరి దుబ్బులను అన్నదాతలు ఆయనకు చూపించారు.
సుమారు 20 నుంచి 25 వేల వరకు..
నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 20 నుంచి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే శేషారావు డిమాండ్ చేశారు. పశువుల దాణా కూడా లేని పరిస్థితుల్లో దాణా సరఫరా చేయాలన్నారు. వరద ముంపునకు గురైన నివాసితులకు నిత్యవసర వస్తువులు, బియ్యం సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.