ETV Bharat / state

'వివాహేతర సంబంధం చూశాడనే.. అంతమొందించారు ' - ap updates

ఆ బాలుడి తల్లి ఉపాది కోసం గల్ఫ్ దేశాల్లో ఉంటోంది. ఆ బాలుడు తండ్రి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఏమైందో తెలియదు.. అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గల్ఫ్ నుంచి వచ్చింది. విగతజీవిగా ఉన్న తన కుమారుడ్ని చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మేనత్త అక్రమ సంబంధం చూశాడనే తన కుమారుడ్ని పొట్టన పెట్టుకున్నారని.. ఇందులో తన మొదటి భర్త కుమార్తె హస్తం కూడా ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమైంది.

'అక్రమ సంబంధం చూశాడనే.. అంతమొందించారు '
'అక్రమ సంబంధం చూశాడనే.. అంతమొందించారు '
author img

By

Published : Jul 31, 2021, 9:14 PM IST

'అక్రమ సంబంధం చూశాడనే.. అంతమొందించారు '

పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కొడమంచిలి శివారు బండివారిపాలెంలో విషాదం జరిగింది. పది సంవత్సరాలు బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడు తండ్రి వద్ద ఉంటుండగా.. అతని తల్లి ఉపాది నిమిత్తం గల్ఫ్​లో ఉంటోంది.

మేనత్త వివాహేతర సంబంధం చూడడంతోనే..!

వర్లగంటి ధనుష్ వర్మ అనే పదేళ్ల బాలుడు తండ్రి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. అతని తల్లి గల్ప్ దేశాల్లో ఉంటోంది. ఏమైందో ఏమో రెండు రోజుల క్రితం ధనుష్ అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లి గల్ప్ నుంచి వచ్చింది. మేనత్త అక్రమ సంబంధం చూశాడనే కారణంతోనే ముక్కుపచ్చలారని తన కుమారుడ్ని హతమార్చారని తల్లి ఆరోపించింది. ఈ హత్యలో తన భర్త మొదటి కుమార్తె కూడా ఉందని.. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసుల కాళ్లమీద పడి రోదించిన తీరు చూపరులను కట్టిపడేసింది.

బాలుడి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని వారి కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తామని మాల మహానాడు నాయకులు ముసలయ్య డిమాండ్ చేశారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎమ్. వెంకటరమణ తెలిపారు.

ఇదీ చదవండి: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.. వైకాాపాలో భగ్గుమన్న విభేదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.