పశ్చిమ గోదావరి జిల్లా మండపాకలో ఐదవ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరిన మల్లుల జగదీష్ అనే బాలుడు.. తిరిగి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేయగా అదృశ్యమైన బాలుడి వివరాలను నిఘా కెమెరాల ద్వారా సేకరించారు. అంతేగాక... విద్యార్ధికి చెందిన పుస్తకాల బ్యాగ్ పెరవలి కాకరపర్రు మధ్య మీడియా ప్రతినిధులకు దొరకగా... వారు పోలీసు స్టేషన్లో అప్పగించారు. ప్రస్తుతానికి విద్యార్థి ఆచూకీపై స్పష్టత రాలేదు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇవీ చదవండి