ETV Bharat / state

చిట్టీల పేరుతో మోసాలు.. నిందితుడికి దేహశుద్ధి - 5 crores fraud in chit fund in nallajerla

చిట్టీల పేరుతో సుమారు రూ. 5 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో చోటు చేసుకుంది.

body-wash-a-person-who-has-committed-5-crores-fraud-in-chit-fund-in-nallajerla-west-godavari-district
చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడ్డ వ్యక్తికి దేహశుద్ధి
author img

By

Published : Sep 26, 2020, 10:19 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన వై లక్ష్మి, ఆమె కుమారుడు మూర్తి గతంలో చిట్టీల పేరుతో కొంతమంది వద్ద నుంచి సుమారు రూ.5 కోట్ల మేర వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో ఆ సొమ్ము తిరిగి కట్టేస్తామనీ ఒప్పుకున్నారు.

అంతే.. తర్వాత నుంచి తల్లీకొడుకు కనిపించకుండా పోయారు. ఇటీవల మూర్తి స్థానికులకు కనిపించగా... స్థానిక గ్రామ సచివాలయం వద్దకు తీసుకెళ్లిన స్థానికులు ఆతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి స్థానికులుకు నచ్చచెప్పి అతన్ని విడిపించారు.

ఇదీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... పొంగుతున్న నదులు, వాగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.