Blast in Crackers Factory: పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 10మంది కార్మికులున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకుని పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా కర్మాగారం గ్రామ శివారు చెరువు సమీపంలో ఉండటంతో ఫైరింజన్ చేరుకోలేని పరిస్థితిలో ఉంది. కర్మాగారానికి 300 మీటర్ల దూరంలోనే అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయారు.
బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి - one person seriously injured in blast
Four Persons Died in Crackers Factory Blast: ప.గో.జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.