Somu Veerraju News: రాష్ట్రంలో జనసేన, భాజపా కలిసే ముందుకెళ్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. తమ మిత్రపక్షం స్పష్టంగా చెప్పిందన్న సోము వీర్రాజు.. పవన్ పేర్కొన్న మూడు మార్గాలల్లో మొదటి దాన్నే తాము పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎవరు మెట్టు దిగుతారో, ఎవరు మెట్టు ఎక్కుతారో త్వరలోనే తెలుస్తుందని సోము చెప్పారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా.. ఈనెల 6, 7 తేదీలలో రాష్ట్ర పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. 6న విజయవాడలో భాజపా రాష్ట్ర స్థాయి శక్తికేంద్ర ప్రముఖుల సమ్మేళనం జరుగనున్న సభాస్థలి ఏర్పాట్లను ఇతర నాయకులతో కలిసి వీర్రాజు సందర్శించారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో సుమారు పది వేల మంది శక్తికేంద్ర ప్రతినిధులు ఉద్దేశించి జేపి నడ్డా ప్రసంగించనున్నారు. 6న సాయంత్రం మేధావుల సమావేశంలో పాల్గోని.. 7న రాజమండ్రిలో గోదావరి గర్జన పేరిట నిర్వహించే బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: