ETV Bharat / state

'2 లక్షల యూనిట్ల ఇసుక మాయమైపోతే... విచారణ చేయించలేదే?'

సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తే అరెస్టులు చేసేందుకు ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ... రైతుల ధ్యానం బిల్లుల చెల్లింపులపై చూపితే మంచిదని భాజపా నేత మాణిక్యాలరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక వెసులుబాటు కోసం కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్రం రూ.20 వేల కోట్లు కేటాయించిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇసుక రీచ్​ నుంచి స్టాక్​ పాయింట్​ వచ్చేలోగా ఇసుక మాయమైపోతుంటే... ఆ విషయంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని మాణిక్యాలరావు ప్రశ్నించారు.

భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు మీడియా సమావేశం

author img

By

Published : Jun 28, 2020, 4:25 PM IST

దేశంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తణుకులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రం రూ.20 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ మొత్తాన్ని సద్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా రంగం ఎక్కువగా విస్తరించి ఉందన్న ఆయన.. అందుకనుగుణంగా ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలో రేవులు అభివృద్ధి చేయడంతోపాటు, నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆక్వా రంగానికి సంబంధించి బ్రూడర్స్ కొరత ఎక్కువగా ఉంది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవాలి. - పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత

సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ.. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బిల్లులపై పెడితే ఇబ్బందుల తొలగిపోతాయని వ్యాఖ్యానించారు. ఇసుక రీచ్​ల నుంచి స్టాక్ పాయింట్లకు చేరేలోగా రెండు లక్షల యూనిట్లు ఇసుక మాయమైనట్లు స్వయాన మంత్రే ప్రకటించారన్నారు. ఇసుక మాయమైన సంఘటనపై ఎందుకు విచారణ చేయించటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో సామాన్యులు, మహిళలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. వైద్యసేవల విషయంలో వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాణిక్యాలరావు ప్రకటించారు.

ఇదీ చదవండి : 'అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేద్దాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.