రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని తుంగలో తొక్కి భవన నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని భాజపా నేత నార్ని తాతాజీ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భాజపా, జనసేన నాయకులు సమావేశమయ్యారు. కూలీలు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక పాలసీని ప్రభుత్వం తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించిన మెడికల్ కళాశాలను నరసాపురంలోనే నిర్మించాలని కోరారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు