పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీలో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. డీసీసీబీ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి వ్యక్తులను అరెస్టు చేశారు. లబ్ధిదారుల పేరుతో 30 లక్షలు రూపాయల రుణాలను బ్యాంకు సిబ్బంది తీసుకొన్నారు. రుణాలు చెల్లించాలంటూ.. బాధితులకు నోటీసులు రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు బాధితులకు రుణాలే ఇవ్వలేదని తేలింది. బ్యాంకు నుంచి ఇచ్చిన రుణాలు లబ్ధిదారులకు అందించకుండా సిబ్బంది పంచుకొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన మేనేజర్లు మురళీకృష్ణ, రామగోపాల్, సిబ్బింది చిట్టిబాబు, విజయ్ భాస్కర్, అచ్యుత్ రావు, శ్రీనివాసరావులను పోలీసులు అరేస్టు చేసి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇదీ చూడండి. పల్లె సారధి విలువల వారధి