పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లిలోని గిరిజన గురుకుల ఉన్నత పాఠశాల విద్యార్ధులు వినూత్న ప్రదర్శన కనబరిచారు. మద్యపాన నిషేధం అనే అంశంపై 777 మంది విద్యార్థినులు ఏకకాలంలో నృత్యాలు చేసి.... తానా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. తెలుగు పద్యాలు ఆలపించిన 116 మంది బాలికలు... తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు... వ్యక్తిత్వ వికాసం, ఆట పాటలు నేర్పితే... వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దిన వాళ్లమవుతామని... ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. రెండు రికార్డ్స్‌లో స్థానం సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: అర్థ శతాబ్దం తర్వాత.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం