ETV Bharat / state

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతడే 'టాపర్' - ravi sri teja

ఎంసెట్​లో మంచి ర్యాంకు సాధించాలంటేనే చదువుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలాంటిది తాడేపల్లిగూడెంకు చెందిన ఓ విద్యార్థి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్​ ఇంజనీరింగ్​లో టాపర్​గా నిలిచాడు. ఆ విజయం వెనుక కష్టాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.

కురుశెట్టి రవిశ్రీతేజ
author img

By

Published : Jun 11, 2019, 4:02 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురుశెట్టి రవిశ్రీతేజ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో సత్తా చాటాడు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంసెట్ ఫలితాల్లో టాపర్​గా నిలిచాడు. ఇవేకాక జేఈఈలోనూ ఉత్తమ ఫలితాలు సాధించాడు.

12 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ
ఎంసెట్ ఫలితాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం వెనుక నిరంతర శ్రమ దాగి ఉందని అంటున్నాడు రవిశ్రీతేజ. పరీక్షల కోసం ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే రోజుకు 12 నుంచి 13 గంటల సమయం చదువుకు కేటాయించానని తెలిపాడు. పరీక్షలు దగ్గరికి వచ్చే కొద్దీ చదువుకునే సమయాన్ని తగ్గిస్తూ వస్తూ మెదడుకు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు, నడక వంటి వాటికి సమయం కేటాయించినట్లు వెల్లడించాడు.

విజయం మంత్రం అదే
పరీక్షలు దగ్గరపడే కొద్దీ అందరూ అన్ని పుస్తకాలు తిరగేస్తుంటారని అలా చదివితే ఉపయోగం లేదని రవిశ్రీతేజ తెలిపాడు. ప్రణాళిక బద్ధంగా చదవడం మొదలు పెట్టి, రాని సబ్జెక్టులపై దృష్టి పెడితే విజయం వరిస్తుందని వివరించాడు. పరీక్షకు వారం ముందు అసలు పుస్తకమే పట్టుకోకూడదని అంటున్నాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందని.. వారి ప్రోత్సాహం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించానని తెలిపాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్​ ఇంజనీరింగ్​లో టాపర్​ రవిశ్రీతేజ

Intro:ap_cdp_17_11_rtc_jagan_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివారెడ్డి అన్నారు. ఆర్టీసీ విలీనానికి కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కడపలో ఎన్ఎంయు నాయకులు జగన్ చిత్రపటంతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కడప డిపో నుంచి ప్రారంభమై ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. హామీ ప్రకారం విలీనానికి కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పారు.

Body:ఆర్టీసీ విలీనం ర్యాలీ

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.