పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో రూ.75 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బుట్టాయిగూడెం సామాజిక ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. సీజనల్ వ్యాధులపై కలెక్టర్, జిల్లా వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయన్న మంత్రి.. మరో 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి..