పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో, సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతు సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. నిధుల మంజురులో జాప్యం లేకుండా చూడాలని కోరింది. ప్రజల్లో పోలవరం ప్రాజెక్టుపై తలెత్తుతున్న గందరగోళ పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముగింపు పలకాలని సూచించింది.
రాజకీయలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రైతు సంఘాల సమాఖ్య కోరింది. అవసరం అనుకుంటే అన్ని పార్టీల ప్రతినిధులను దిల్లి తీసుకెళ్లి ప్రధానితో చర్చించాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా పార్లమెంట్లో పోలవరంపై ప్రస్తావించి పూర్తిస్థాయిలో నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరింది. విజయవాడలో 'పోలవరంపై సమష్టిగా గళం వినిపిద్దాం' అనే నినాదంతో ప్రత్యేక చర్చ కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: 'ఏ అంటే అమరావతి.. పి అంటే పోలవరం.. ఏపీని కాపాడండి'