కరోనాపై పోరుకు 'ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్' రూ.2 కోట్లు, అనుబంధ సంస్థలైన జోసిల్ లిమిటెడ్ (గుంటూరు) 25 లక్షలు, ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (విశాఖపట్నం) రూ.50 లక్షలు, జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(తణుకు) రూ.10 లక్షలు విరాళం ప్రకటించాయి. మొత్తం రూ.2.85 కోట్ల చెక్కును సంస్థ ప్రతినిధి పెండ్యాల అచ్యుతరామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. సంస్థలు సామాజిక నిధుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చినట్లు ఆ సంస్థ అధినేత పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి వివరించారు. నగదు విరాళంతో పాటు రూ.80 లక్షల విలువైన 800 టన్నుల సోడియం హైపోక్లోరైడ్, 7,500 లీటర్ల శానిటైజర్లను అవసరమైనవారికి పంపిణీ చేయటానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
కరోనాపై పోరుకు ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ భారీ విరాళం - Jayalakshmi Fertilizers Limited donation to CM relief fund
కరోనా వైరస్ నివారణ చర్యల నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉన్న 'ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్' అనుబంధ సంస్థలతో కలిపి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చారు. రూ.2.85 కోట్ల చెక్కును ఆ సంస్థ ప్రతినిధులు పెండ్యాల అచ్యుతరామయ్య సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేశారు.
![కరోనాపై పోరుకు ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ భారీ విరాళం కరోనాపై పోరుకు ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ భారీ విరాళం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6702515-814-6702515-1586271838066.jpg?imwidth=3840)
కరోనాపై పోరుకు 'ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్' రూ.2 కోట్లు, అనుబంధ సంస్థలైన జోసిల్ లిమిటెడ్ (గుంటూరు) 25 లక్షలు, ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (విశాఖపట్నం) రూ.50 లక్షలు, జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(తణుకు) రూ.10 లక్షలు విరాళం ప్రకటించాయి. మొత్తం రూ.2.85 కోట్ల చెక్కును సంస్థ ప్రతినిధి పెండ్యాల అచ్యుతరామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. సంస్థలు సామాజిక నిధుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చినట్లు ఆ సంస్థ అధినేత పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి వివరించారు. నగదు విరాళంతో పాటు రూ.80 లక్షల విలువైన 800 టన్నుల సోడియం హైపోక్లోరైడ్, 7,500 లీటర్ల శానిటైజర్లను అవసరమైనవారికి పంపిణీ చేయటానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 3 మంత్రిత్వ శాఖలు.. విరాళంగా రూ.200 కోట్లు