Halchal in Undrajavaram: స్నేహితుడు మరణించాడనే మనస్తాపంతో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సుమారు గంటన్నర సేపు టవర్ పైనే ఉండి... స్థానిక ప్రజలతో పాటు పోలీసులను భయాందోళనకు గురి చేశాడు. ఉండ్రాజవరం ఎస్సై రామారావు యువకుడ్ని కిందికి రప్పించే ప్రయత్నం చేశారు. యువకుడి కుమారుడ్ని ఎత్తుకుని చూపిస్తూ కిందికి రావాలని సూచించగా...అతడు దిగి వచ్చాడు.
కిందికి దిగి వచ్చిన యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన తన స్నేహితుడు రంజిత్ రమ్మని పిలుస్తున్నాడు అని దావీదు పోలీసులకు చెప్పటం విస్మయ పరిచింది. దావీదును వైద్యులకు చూపించాలని కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: Torture: చిన్నారిపై పెంపుడు తల్లి కర్కశత్వం.. ఒళ్లంతా వాతలు పెట్టి చిత్ర హింసలు !